Monday, September 1, 2014

సంస్థ కోసం సిబ్బంది

ఎప్పుడూ rtc సిబ్బంది సమ్మె చేస్తున్నారు అని వార్త వినగానే ఏ వేతన సవరణ కోసo అయ్యుంటుంది అని అనుకుంటాం, అయ్యో సంస్థ అప్పుల్లో ఉందంటారు చార్జీలు పెంచుతారు మళ్ళీ వేతన సవరణలేంటనే నాలుక కొరుక్కునే వారూ  ఉన్నారు . ఈ మధ్య రాష్ట్ర విభజన చెయ్యాలని ఒకరు , చేయ్యొద్దని ఒకరు సమ్మె చేసారు  కానీ .. అది రెండు వేల మూడు నాలుగు మధ్య నుకుంటా నాకు ఊహ తెలిసాక మొదటి సారి హైదరాబాద్ లో సిటీ బస్సులు చాల రోజుల పాటు నడవలేదు.. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ మధ్య మా కండక్టర్ గారితో ఆ సమ్మె గురించి ఆరా తీస్తే సంస్థ కోసం సిబ్బంది ఎంత వరకైనా వెళ్తారని అర్థమైంది .. నిజమే ,  నష్టాల ఉబిలోకి వెళ్ళిపోతున్న సంస్థ కి రాయితీలు ఇవ్వరు కాని ముక్కు పిండి పన్నులు వాసులు చేయడం తగదని అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం హయాం లో సమ్మె జరిగింది . సంస్థ మనుగడ బాగుండాలని అశిoచి  సమ్మె కి దిగడమే కాదు .. సంస్థ సిబ్బంది మొత్తం తమ ఒక రోజు జీతాన్ని విరాళం గ ఇస్తే ఒక మహా అద్భుతం జరిగింది .. మరెక్కాడా  లేని విధంగా సిబ్బంది ఇచ్చిన ఆ విరాళాల తో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లోని ఇరవై మూడు జిల్లాలకు ఒక్కో జిల్లాకి ఒక్క బస్సు చొప్పున ఇరవై మూడు బుస్సులని కొని వాటికి ఆర్తీసి వెలుగు అని పేరు పేరు పెట్టారు నిజం గా .. ప్రగతి రథ చక్ర సారధులు తలుచుకుంటే పల్లెలు ఎప్పుడు ఆర్టీసీ వెలుగులతో సంతోషం గా  ఉంటాయి . 


  a city bus from musheerabad depot bought with the donations by rtc employees doing koti-secunderabad on 40 route drenching in rain outside koti terminal 

 " RTC VELUGU - ఆర్తీసీ వెలుగు "
  • Creative Commons License

  • LoveofZ is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License
  • .