Monday, January 30, 2017

ప్రగతి రథం - ప్రజల నేస్తం


అదిగో అందరి బస్సు ఆర్డినరి బస్సు. దశాబ్దాలు గా తన చక్రాలు మీద పల్లె బ్రతుకులను ఆప్యాయం గా పలకరించే నేస్తం. తరాలు మారినా ప్రజల అంతరాలలో నాటుకుపోయిన రవాణాబంధువు.

పల్లె దైనందిన జీవితం లో అదొక భాగం. పల్లెకు, పట్నం కు అదొక వారధి. గందరగోళ పట్నం నాగరికత నుంచి పచ్చని పల్లెటూరుకు వెళ్ళే నిత్య బాటసారి . రహదారి ఎలా ఉన్నా, తన పరిస్థితి ఎలా ఉన్నా తనని సరిగ్గా  పట్టించుకోకపోయినా ఏనాడు విరామం ఎరగని శ్రామికురాలు. పచ్చని పంటపొలాలు, ఆకలి తీర్చే రైతన్న స్వేదాన్ని ఆకలి కేకలతో ఏడ్చే ఊరి చివర బ్రతుకులను, భూములను మింగే భూస్వాములను, పాఠశాలలకు పరిగెత్తే పసి మొగ్గలను, ఏటిలో ఈదులాడే మూగ జీవాలను, ఎండిన బ్రతుకులను, బీడువారిన భూములను, స్వేఛ్ఛగా నిరంతరం సంచరించే పశు పక్షాదులను కొండ అంచులకు, లోయ సోయగాలను, అందమైన సీమ సోయగాలను, పిల్ల పైరు గాలి పలకరింపును, ఎన్నో మరెన్నో చూసింది.
అమెరికా నుండి వచ్చు పిల్లలను ఆప్యాయంగా తల్లిదండ్రులకు చేర్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు వారి మూగ రోదనను మౌనంగా వినింది. కని, మోసి  పెంచిన పిల్లలను పెళ్లి చేసి పట్నంకు పంపే తల్లితండ్రుల హృదయంలో తెలియని ఒక దుఖం చూసింది. పెద్ద చదువులకు ఉన్నత ఆశయాలతో పట్నం, నగరం వెళ్ళే పసి మనసులను పలుకరించింది.
పల్లెకు ఆకలి వేసినా, అనారోగ్యమొచ్చినా, ఏ అవసరం వచ్చినా, అన్నింటికీ తన ఉపయోగం పడింది. తల్లితండ్రులని పోషించడానికి టాపీ పట్టుకొని తెలుగు నేల చివరకు వెళ్ళేవారిని పట్నం బస్సు స్టాండ్ ల వరకు వదిలిపెట్టింది. ప్రతి పల్లెటూరి వాసి హృదయం లో, జీవితం లో ఏదో ఒక రూపం లో అనుబంధం కలిసి ఉన్న చక్రం పల్లె బస్సు చక్రం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పల్లెవెలుగు గురించి వార్తల్లో సంస్థకి నష్టాలు తెచ్చే గుదిబండలు గా మారాయని తప్ప ఇంకేమన్నా వినిపిస్తుందా. పల్లెవెలుగు కే గాని ప్రాణం ఉంటె మనకి ఎం చెప్పేది ?

పల్లెవెలుగు మాటల్లో ...

నా వల్ల నష్టం వస్తుందంటే అది మీ అసమర్థత కానీ, నా ప్రయత్నం లో ఎప్పుడూ లోపం లేదు. నాకు గుర్తింపు లేక పోయినా, మీ గౌరవం కోసం పోస్టర్లలో  volvo, scania, indra, super luxury సరసన ఏ రోజు నాకు చోటు ఇవ్వకపోయినా నేను పట్టించుకోను. పట్నం బస్టాండ్ లో, సగటు మనిషి అవసరం లో, పల్లె గుండెలో, ప్రకృతి ఒడిలో, పల్లె కాలువ గట్టు మది లో, నన్ను ఎప్పుడు తలుచుకునే మీ బాల్యం ఙ్నాపకాలలో ఎప్పుడు ఉంటాను. నాకు నేనే పోటి, లేదు నాకు సాటి.

పల్లెవెలుగులను, వాటి ప్రాముఖ్యతను మర్చిపోఎలోపు గ్రామాలకు అవి ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. తెలంగాణ లోని గుండంపల్లి గ్రామ ప్రజలు మరియు వారి ధనలక్ష్మి కథ (ఆంగ్లం లో) ..

Both APSRTC and TSRTC Don't generally send new/medium aged buses on night out services . Generally, they use 12-15 years old buses for night out services. But here, it is a different story !

Bus no : 01Z-0042
Name : Dhanalaxmi
Route : Nirmal-Gundampally.

Gundampally(Samundarpally) is a village located on the banks of river Godavari. This is a special village in the region served by Nirmal depot. People from this village treat the BUS as their own. They sweep and wash the bus twice a day. They treat the bus as their “Dhanalakshmi” - the bus which brings Wealth to their life.

The people of Gundampally fitted a clock in the bus along with first aid kit and Tape Recorder with the money of village development committee. They also arranged a person from village with monthly salary to keep the bus clean and wash it daily. He also serves the crew during night halt. They also decorate the bus with special flower garlands and mango leaves during special occasions and festivals.

Night halt parking is provided at panchayat office. A Double Room has been constructed and a Cooler,Fan,Fridge,Mineral Water and TV have been provided for the CREW who Halt in village at Night.

At a time when we are seeing more and more villages moving away from buses to shared autos and cabs this village has shown the way. Their effort to support a service so Important should be lauded.

పల్లెలు ఎప్పుడు ప్రగతి రథ చక్రాల  వెలుగులతో సంతోషం గా ఉంటాయని ఆశిస్తూ, శెలవు.
telugu text by kiran dhanalakshmi story by krishna 

Sunday, January 15, 2017

Experiments


We are starting this year with an Experiment, 
We are starting this year with an interactive map ! 

Early last year, we thought of doing a series "Know Your Corporation". The idea was to explain the organizational structure and various other things we know about APSRTC and TSRTC using various media. We spent the last year building our research and learning new skills.

Depots by Region is a (work in progress) map with all of the depots in Telangana mapped and segregated according to the regions they belong to. We hope to add more meta data to this map in the coming days.
What do you want to see ? Let us know in comments ! 

Depots by Region



Hover on the points for the depot name
Use the search function to find a place

Have fun using the map :)
More interesting stuff coming your way !


via GIPHY
  • Creative Commons License

  • LoveofZ is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License
  • .